జీసీసీలో టెండర్ల ద్వారా కొనుగోళ్లు

27 Jul, 2016 00:12 IST|Sakshi


అరకులోయ: డీఆర్‌ డిపోల్లో నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు విక్రయించేందుకు ఇకపై టెండర్‌లు పిలిచి సరుకులు కొనుగోలు చేయనున్నట్టు పాడేరు జీసీసీ డీఎం శర్మ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి వరకు జీసీసీ బ్రాంచ్‌ కార్యాలయంలో సేల్స్‌మన్లతో సమావేశం నిర్వహించారు. ప్రతీ డీఆర్‌ డిపోలో బియ్యం, కిరోసిన్, పంచదార, కాకుండ ఇతర నిత్యవసర వస్తువులను రూ. 50వేలకు తగ్గకుండా విక్రయించాలని ఆదేశించగా సేల్స్‌మన్లు అడ్డుతగిలారు. గిరిజన ప్రాంతంలో నెలకు రూ. 50 మించి ఇతర సరుకులు కొనుగోలు చేయనప్పుడు ఏ విధంగా రూ. 50 వేల సరుకుల విక్రయిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన వస్తువులను  తక్కువకు లభిస్తుంటే జీసీసీలో నాణ్యత లేని వస్తువులు అధిక ధరకు ఎలా కొనుగోలు చేస్తామని గిరిజనులు ప్రశ్నిస్తున్నారనిడీఎం దష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇకపై టెండర్ల ద్వారా సరకులు కొనుగోలుచేసి తక్కువధరకు విక్రయిస్తామన్నారు. ఈ ఏడాది నుంచి  కాఫీ రైతులకు రుణాలు అందజేస్తామన్నారు. అరకులోయలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన మీ ఇంటికి మీ సరుకు కార్యక్రమం నిలిపివేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జీసీసీ సూపరింటెండెంట్‌ వల్లేసి గాసి, సిబ్బంది పాల్గొన్నారు.

 

>
మరిన్ని వార్తలు