జెన్‌కో బొగ్గు రవాణా పేరిట దోపిడీ

10 Sep, 2016 00:09 IST|Sakshi
జెన్‌కో బొగ్గు రవాణా పేరిట దోపిడీ
వరంగల్‌ : జెన్‌కో నిర్వహణలోని కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు జరుగుతున్న బొగ్గు రవాణాలో కోట్ల రూపాయాలు దోచుకుం టున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010లో కాకతీయ థర్మల్‌ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం అయ్యిందన్నారు. బొగ్గును స్థానిక భూపాలపల్లి గనుల నుంచి తీసుకోకుండా నాణ్యత పేరుతో గోదావరిఖని నుంచి తెప్పించడం వల్ల రవాణా చార్జీలతో బొగ్గు ధర పెరిగి ఉత్పత్తి వ్యయంపై భారం పడుతోందన్నారు. ఇది కేవలం కాంట్రాక్టర్లకు దోచిపేట్టేందుకే కోల్‌ డైరెక్టర్, పవర్‌ స్టేషన్‌ ఎస్‌ఈలు ఈ పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు ఉప్పల్‌ స్టేషన్‌లో బొగ్గును నీటితో కడగడం వల్ల ప్రతి రోజు 200 టన్నుల బరువు అదనంగా కాంట్రాక్టర్‌కు కలసి వస్తోందన్నారు.  ఎక్కువ వచ్చిన బొగ్గును సిమెంట్‌ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలకు అమ్ముకునేందుకు లారీల్లో తరలిస్తుం టే కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో పోలీసులు పట్టుకొని సీజ్‌ చేశారని అన్నారు. ఈ బొగ్గు రవాణా కాంట్రాక్టు కాంగ్రెస్‌ నేత గండ్ర రమణారెడ్డి కుటుంబానిదే కావడం వల్ల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు. అధికార పార్టీ నేతలకు సైతం భారీ మొత్తంలో ముడుపులు చెల్లించడం వల్ల ఈ దోపిడీని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోవడం లేదన్నారు. ఇప్పటి వరకు బొగ్గు రవాణా, కొనుగోలు, తదితర విషయాల్లో సుమారు రూ.1500 కోట్ల వరకు దళారులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలసి పంచుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీ సీఐడీ, సెంట్రల్‌ విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌కు, జెన్‌కో సీఎండీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మిషన్‌ కాకతీయ పనుల్లో అవినీతి జరిగిందని అనేదానికి ఇటీవల ఐదుగురు ఇంజనీర్ల సస్పెన్షన్లే రుజువని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకొని తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూ రు అశోక్‌కుమార్, నాయకులు ఆక రాధాకృష్ణ, చాడా రఘునాథరెడ్డి, హన్మకొండ సాంబయ్య, రహీం, మార్గం సారం గం, తాళ్లపల్లి జయపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 
l అధికార పార్టీ నాయకులకు వాటాలు
l బొగ్గు అక్రమ రవాణా చేస్తున్న కాంట్రాక్టర్‌
l ఆరేళ్లలో రూ.1500కోట్లు లూటీ
l టీyీ పీ జిల్లా అధ్యక్షుడు 
గండ్ర సత్యనారాయణరావు 
మరిన్ని వార్తలు