జీజీహెచ్‌లో మెరుగైన వైద్యం

28 Apr, 2017 00:46 IST|Sakshi
  • కోమాలో ఉన్న మహిళకు స్వస్థత 
  • కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) :
    హైబీపీ, తీవ్ర జ్వరంతో అస్వçస్థతకు గురై కోమాలో ఉన్న ఒక వివాహితకు స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యులు సకాలంలో వైద్యం చేసి ఆమె ప్రాణదానం చేశారు. విషమ పరిస్థితిలో అత్యవసర చికిత్స కోసం రూ.3 లక్షల వరకూ ఖర్చవుతుందని ప్రైవేటు వైద్యులు చెప్పడంతో.. ఆర్థికస్తోమతు లేక జీజీహెచ్‌లో భార్యను చేర్చిన భర్త ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. పిఠాపురానికి చెందిన 40 ఏళ్ల దాశెట్టి లక్ష్మి ఈ నెల 21న హైబీపీ, తీవ్రమైన జ్వరంతో కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఏమీ చెప్పలేమని, రూ.3 లక్షల దాకా ఖర్చు అవుతుందని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు భర్త సత్యనారాయణకు చెప్పారు. వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవించే తాను అంత ఖర్చు భరించలేనంటూ ఆమెను ఈ నెల 23న కాకినాడ జీజీహెచ్‌లోని మెడికల్‌ విభాగంలోకి చేర్చాడు. ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్న రోగికి మెడికల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీవీవీ సత్యనారాయణ వెంటిలేటర్‌పై తక్షణ చికిత్స ప్రారంభించారు. ఆదివారం ఆయన ఆస్పత్రిలోనే ఉండి ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ చేశారు. 72 గంటల తర్వాత ఆమె యథాస్థితికి చేరుకుంది. ఈ వివరాలను గురువారం ఆయన విలేకరులకు వివరించారు. జీజీహెచ్‌లో నాణ్యమైన వైద్యులు అందుబాటులో ఉన్నారని, వెంటిలేటర్లు మరిన్ని అందుబాటులో ఉంటే ప్రాణపాయంలో ఉన్న నిరుపేదలకు పునర్జన్మను ప్రసాదించవచ్చన్నారు. మెడిసి¯ŒS హెచ్‌ఓడీ డాక్టర్‌ తిరుమలరావు పర్యవేక్షణలో రోగికి వైద్యసేవలు అందించినట్టు చెప్పారు. భార్యకు ప్రాణదానం చేసిన వైద్యులకు ఆమె భర్త కృతజ్ఞతలు తెలిపారు. 
     
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా