‘కానుక’ బెల్లంలో పురుగులు

12 Jan, 2017 02:45 IST|Sakshi
‘కానుక’ బెల్లంలో పురుగులు
కొవ్వూరు : క్రిస్మస్, సంక్రాంతికి అందించే చంద్రన్న కానుకల్లో నాణ్యత లేదని పదేపదే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం నిమ్మ కు నిరెత్తి్తనట్టు వ్యవహరిస్తోంది. గతనెలలో క్రిస్మస్‌ సందర్భంగా ఇచ్చిన కానుక సరుకుల్లో నాణ్యత లేదని నాసిరకం బెల్లం పంపిణీ చేశారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో సం క్రాంతి కానుకల్లో అదే పరిస్థితి కొనసాగుతుండటంపై రేష¯ŒS లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని మంత్రులు చెబుతున్నారే తప్ప ఆచరణలో అది అమలు కావడం లేదు. చాగల్లు మండలం దారవరం గ్రామంలో షాప్‌ నెం.5 లో సంక్రాంతి చంద్రన్న కానుకలో భాగంగా పంపిణీ చేసిన »ñ ల్లంలో పురుగులు, నల్లమట్టి ఉండటంతో లబ్దిదారులు ఖంగుతిన్నారు. కార్దుదారులు వెంటనే సంబంధిత డీలర్‌కు బెల్లం తిరిగి ఇచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై డీలర్‌ అధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఈ బెల్లాన్ని తీసుకుని కొత్త బెల్లాన్ని అందించినట్టు సమాచారం
 
మరిన్ని వార్తలు