డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో అమ్మాయిల హావా

7 Jan, 2017 00:11 IST|Sakshi
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల సెమిస్టర్‌ పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటారు.  గతేడాది నవంబరులో నిర్వహించిన మొదటి, మూడవ సెమిస్టర్, సíప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం ఆర్‌యూ వీసీ వై.నరసింహులు, రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌  విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌ పరీక్షలకు 16,944 మంది విద్యార్థులకుగాను  9743 మంది, మూడవ సెమిస్టర్‌ పరీక్షల్లో 14,410 మందికిగాను 8088 మంది ఉత్తీర్ణులయ్యారు. సఫ్లిమెంటరీ పరీక్షల్లో 14,692 మంది విద్యార్థులు హాజరైతే 8139 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఠీఠీఠీ.టuజు.్చఛి.జీn, ట్ఛటu ్టట.టuజు.్చఛి.జీn, ఆయా కాలేజీ ప్రిన్సిపాల్‌ దగ్గర ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు ఆర్‌యూ సీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
మొదటి సెమిస్టర్‌ పరీక్షలు
- బీఏలో అబ్బాయిలు 1838లో 992 మంది, అమ్మాయిలు 573కుగాను 425 మంది ఉత్తీర్ణులయ్యారు. బీబీఏలో అబ్బాయిలు 193కుగాను 105, అమ్మాయిలు 135కు 115 మంది, బీసీఏలో అబ్బాయిలు 128కిగాను 50, అమ్మాయిలు 39లో 30 మంది ఉత్తీర్ణులయ్యారు. బీకామ్‌లో అబ్బాయిలు 4443లో 2042, అమ్మాయిలు 1626లో 1195, బీఎస్సీలో అబ్బాయిలు 4231లో 2032, అమ్మాయిలు 3766లో 2747 మంది ఉత్తీర్ణులయ్యారు. 
మూడో సెమిస్టర్‌..
 - బీఏలో అబ్బాయిలు 1588లో 739 మంది, అమ్మాయిలు 659లో 428, బీబీఏలో అబ్బాయిలు 160లో 126 మంది, అమ్మాయిలు 118లో 115 మంది పాసయ్యారు. బీసీఏలో అబ్బాయిలు 34లో 16, అమ్మాయిలు 15లో 09 మంది, బీకామ్‌లో అబ్బాయిలు 3864లో 1311, అమ్మాయిలు  1642 మందిలో 1064, బీఎస్సీలో అబ్బాయిలు 3340లో 1806, అమ్మాయిలు 2975లో 2408 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 
 
మరిన్ని వార్తలు