ఉపాధ్యాయులకు 20శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలి

26 Aug, 2016 00:46 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త జిల్లాల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు 20శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీని కలిసి వినతిపత్రం అందించారు. జెడ్పీ జీపీఎఫ్‌ను రద్దు చేసి జిల్లాల ప్రక్రియ కంటే ముందుగానే ఏజీ జీపీఎఫ్‌ ఖాతాలను కేటాయించి వాటిలో జెడ్పీ జీపీఎఫ్‌ డబ్బులు జమ అయ్యేట్లు చూడాలని పేర్కొన్నారు. జిల్లాల విభజన కంటే ముందే ఉపాధ్యాయుల పెండింగ్‌ రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు