బాధితులకు భరోసా కల్పించండి

4 Sep, 2016 00:10 IST|Sakshi
బాధితులకు భరోసా కల్పించండి
– ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డీఐజీ
– పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సందర్శన
– జూపాడుబంగ్లా పోలీసు స్టేషన్‌ పరిశీలన
 
జూపాడుబంగ్లా:  పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం అందుతుందనే భరోసా కల్పించేలా సిబ్బంది వ్యహరించాలని డీఐజీ రమణకుమార్‌ అన్నారు. పారుమంచాల గ్రామానికి చెందిన ఇండియన్‌ డిఫెన్స్‌ సర్వీసు అధికారి ధర్మారెడ్డి తండ్రి ఆర్లపాటి సుబ్బారెడ్డి గత నెల 24న మతి చెందారు. ఈ సందర్భంగా డీఐజీ రమణకుమార్‌ శనివారం పారుమంచాల గ్రామానికి చేరుకొని «ధర్మారెడ్డి, అతని తల్లి వెంకటలక్ష్మమ్మను పరామర్శించారు. అనంతరం ధర్మారెడ్డితో కాసేపు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం డీఐజీ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను సందర్శించి పాత, కొత్త గేట్లను పరిశీలించారు. నీటి విడుదల వివరాలను ఎన్‌సీఎల్‌ సిబ్బంది రమణ వివరించారు. అనంతరం ఆయన జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌కు చేరుకొని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది వివరాలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులపట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించటంతోపాటు వారిచ్చే ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించాలన్నారు. న్యాయ, అన్యాయాలను విచారించి తగిన చర్యలు తీసుకోవడంతోపాటు వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, న ందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్‌ఐలు సుబ్రమణ్యం, శివాంజల్, లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు