క్రీడాకారులకు ప్రోత్సాహమివ్వాలి

10 Aug, 2016 23:41 IST|Sakshi
క్రీడాకారులకు ప్రోత్సాహమివ్వాలి

కోదాడఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ్రMీ డాకారులకు ప్రోత్సాహమిచ్చి క్రీడారంగ అభివృద్ధికి కృషి చేయాలని వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చందా నాగిరెడ్డి కోరారు. బుధవారం కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అతిథిగృహంలో జరిగిన సమావేశంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ  ప్రాంత క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియాలు నిర్మించాలన్నారు. క్రీడాకారులైన విద్యార్థులకు ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో 2.5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. క్రీడాకారుల సంక్షేమం కోసం ఈ నెల 21న పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాకారుల సంక్షేమ నియోజకవర్గ  కమిటీని ఎన్నుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో క్రీడాకారులు  కళ్యాణ్, శ్రీనివాసరావు, ఎస్‌కె.బాగ్దాద్,  తిరుపతయ్య, ఆలేటి సహదేవ్, శ్రావణ్‌కుమార్, పాలడుగు సంజీవ్, జూలూరు వీరభద్రం, చిన్నా,  గోపిచంద్, రామదాసు, విజయ్‌కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు