కందికి రక్షకతడి ఇవ్వండి

17 Oct, 2016 23:30 IST|Sakshi
వీడియోకాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్‌:    వర్షాభావ పరిస్థితు ల వల్ల ఎండుతున్న కంది పంటకు రెయిన్‌గన్ల ద్వారా రక్షకతడులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదేశించారు. సోమవారం ఉదయం రూరల్‌ మండలం ఉప్పరపల్లి వద్ద కంది పంటను పరిశీలించిన కలెక్టర్‌... సాయంత్రం వ్యవసాయశాఖ ఏఓ, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏక పంటగానూ, అంతర పంటగా వేసిన కంది ప్రస్తుతం బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. రెయిన్‌గన్లను ఉపయోగించి కంది మొదళ్ల వద్ద నీటి తడులు ఇవ్వాలన్నారు. ప్రస్తుతానికి పూర్తిగా ఎండిపోతున్న దశలో ఉన్న 4 వేల హెక్టార్ల పంటకు యుద్ధప్రాతిపదికన తడి ఇవ్వాలని ఆదేశించారు. అందుకోసం కలెక్టరేట్‌లో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌రూం పనిచేస్తుందన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ 18004256401 అందుబాటులో పెట్టామన్నారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  పర్యవేక్షణ  బాధ్యత ఆర్డీవోలు తీసుకోవాలన్నారు.  కార్యక్రమంలో జేసీ–1 బి.లక్ష్మీకాంతం, జేసీ–2 ఖాజామొహిద్ధీన్, ట్రైనీ కలెక్టర్‌ వినోద్‌కుమార్, వ్యవసాయశా ఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ నాగభూషణం, జె డ్పీ సీఈవో రామచంద్ర, డీపీఓ జగదీశ్వరమ్మ, శా స్త్రవేత్తలు సహదేవరెడ్డి, సంపత్‌కుమార్, నాయక్, పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు