కళలను పోషిద్దాం

8 Nov, 2016 21:59 IST|Sakshi
కళలను పోషిద్దాం
మంత్రాలయం : హిందూ సంస్కృతి, ఆచారాలను సృషించే కళలను పోషించడానికి ప్రతిఒక్కరూ తమ వంతు కృషి చేయాలని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పిలుపునిచ్చారు. కార్తీక మాసం పురస్కరించుకుని గురుసార్వభౌమ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమఠంలో హరిదాస సమ్మేళనం ప్రారంభించారు. ముందుగా పీఠాధిపతి జ్యోతులు వెలిగించి కార్యక్రమానికి అంకురార్పణ పలికారు. స్వామీజీ మాట్లాడుతూ దైవ చింతనకు దాస సాహిత్యం ఎంతో దోహద పడుతుందన్నారు. హరికథలు, సంగీత విభావరి, భక్తికీర్తనలు భక్తుల్లో ప్రశాంతతను నెలకొల్పుతాయన్నారు.  ప్రతి భక్తుడూ హరిదాసులను ఆదరించాలన్నారు.  కార్యక్రమంలో మేనేజర్‌ శ్రీనివాసరావు, సంస్కృత పాఠశాల ఉప కులపతి పంచముఖి, ప్రధానాచార్యులు వాదిరాజాచార్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు