వైభవం.. కామదహనోత్సవం

10 Mar, 2017 22:21 IST|Sakshi
వైభవం.. కామదహనోత్సవం

శ్రీశైలం: హోలీ పౌర్ణమికి ముందు కాముని చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా దహింపజేయడం శ్రీశైల మహాక్షేత్రంలో ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి 7.గంటలకు ఉత్సవమూర్తులను పల్లకిలో అధిష్టింపజేసి ప్రధాన మాడ వీధిలోని గంగాధర మండపం వద్దకు చేర్చారు. అక్కడ కాముని చిత్రపటాన్ని గడ్డితో ఏర్పాటు చేసిన దానిపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత   వేదమంత్రోచ్చారణల మధ్య కాగాడాలతో కామ(మన్మథ రూపాన్ని) దహనం చేశారు. శివుని తపోభంగం చేసిన పాల్గున శుద్ధ చతుర్దశి రోజున మన్మథుడిని త్రినేత్రంతో దగ్ధం చేశారని, ఈ కామదహన క్రతువును దర్శించడం వల్ల శివకటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
 

మరిన్ని వార్తలు