నిలకడగా వరద ఉధృతి

24 Jul, 2017 00:16 IST|Sakshi
నిలకడగా వరద ఉధృతి
సముద్రంలోకి 3,52,472 క్యూసెక్కుల నీరు విడుదల
కొవ్వూరు:
గోదావరిలో వరద ఉధృతి నిలకడగా ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నాలుగు ఆర్మ్‌లు వద్ద ఉన్న 175 గేట్లును ఎత్తి 3,52,472 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆనకట్ట వద్ద నీటి మట్టం 8.90 అడుగులుగా నమోదైంది. ఉభయగోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 13 వేల క్యూసెక్కుల నీరు సాగు అవసరాలకు విడిచిపెడుతున్నారు. దీనిలో తూర్పుడెల్టాకు 4,500, సెంట్రల్‌ డెల్టాకు 2,000, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తున్నారు.
 
తగ్గుతున్న నీటి మట్టం
కాలేశ్వరంలో 5.11 మీటర్లు, పేరూరులో 7.0, దుమ్ముగూడెంలో 7.57, కునవరంలో 9.06, కుంటలో 4.97, కొయిదాలో 12.0, పోలవరంలో 8.58, రోడ్డు కం రైలు వంతెన వద్ద 14.02 మీటర్లు చొప్పున, భద్రచలంలో 24.30 అడుగుల నీటిమట్ట నమోదైంది. ఎగువన నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో వరద ఉధృతి క్రమేపీ తగ్గుతోంది.
 
>
మరిన్ని వార్తలు