త్వరలోనే గోదావరి జలాలు : ప్రభుత్వ విప్‌

6 Aug, 2016 18:54 IST|Sakshi
త్వరలోనే గోదావరి జలాలు : ప్రభుత్వ విప్‌
యాదగిరిగుట్ట:  మిషన్‌ భగీరథ పథకం ద్వారా త్వరలోనే ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు గోదావరి జలాలు వస్తాయని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గజ్వేల్‌ మండలం కోమటిబండలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలలు కన్న మిషన్‌ భగీరథ పథకం ప్రారంభం కాబోతుందని, దీంతో మొదటగా ఈ రెండు ప్రాంతాలకు నీళ్లు రాబోతున్నాయని తెలిపారు. ప్రధాని తొలిసారిగా తెలంగాణకు వస్తున్నందున్న ప్రత్యేక నిధులు కేటాయిస్తార ని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, సర్పంచ్‌ బూడిద స్వామి, టిఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, మండల, పట్టణ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, కాటబత్తిని ఆంజనేయులు తదితరులున్నారు.
 
 

 

మరిన్ని వార్తలు