రోడ్డెక్కిన గోదావరి జలాలు

28 Jul, 2016 18:34 IST|Sakshi
రోడ్డెక్కిన గోదావరి జలాలు

పైప్‌ లీకేజితో వృథాగా పోతున్న నీరు

జగన్‌గూడ మూలమలుపు వద్ద లీకేజీ


శామీర్‌పేట్‌: శామీర్‌పేట్‌ మండలం జగన్‌గూడలో గోదావరి జలాల కోసం ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ లీకేజీతో నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా శామీర్‌పేట్‌ మండలం అలియాబాద్‌ చౌరాస్తా నుంచి యాదాద్రి(యాదగిరి గుట్ట) వరకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న తాగునీటి పైప్‌లైన్‌ జగన్‌గూడ వద్ద గురువారం ఉదయం లీకేజీ అయింది. దీంతో గోదావరి జలాలు రోడ్డుపై పారుతుండడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సబ్‌ కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పైప్‌లైన్‌ లీకైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పైప్‌లైన్‌ను పరిశీలించి లీకేజీని అరికట్టి నీరు వృథా కాకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు