జిల్లాకు చేరిన గోదావరి జలాలు

29 Sep, 2016 22:24 IST|Sakshi
జిల్లాకు చేరిన గోదావరి జలాలు
తిరుమలగిరి : ఎట్టకేలకు జిల్లా రైతుల నిరీక్షణ ఫలించింది. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న గోదావరి జలాలు బుధవారం రాత్రి జిల్లాకు చేరుకున్నాయి. వరంగల్‌ జిల్లా బయ్యన్న వాగు నుంచి 1300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో జిల్లాలో 69వ డీబీఎంకు 450, 71 డీబీఎంకు 850 క్యూసెక్కుల నీరు విడుదలైంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండి గేట్లు తీయడంతో ఎల్‌ఎండికి నీరు చేరింది. ఎల్‌ఎండి నుంచి 8 టీఎంసీల నీటిని కాకతీయ కాల్వకు, అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీ 2వ దశకు నీటిని విడుదల చేశారు. దీంతో నల్లగొండ జిల్లాలో 2,52,545 ఎకరాలకు ఉపయోగపడుతుంది. వారం రోజుల క్రితం వరంగల్‌ జిల్లా బయ్యన్న వాగు నుంచి నీటిని విడుదల చేసినా వరద తగ్గడంతో 69వ డీబీఎంకు నీటి విడుదల ఆగిపోయింది. అయితే ఎల్‌ఎండీ నుంచి గోదావరి జలాలు విడుదల కావడంతో ఎట్టకేలకు నల్లగొండ జిల్లాకు గోదావరి నీళ్లు చేరుకున్నాయి. ఈ నీటిని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు నింపడానికి ఉపయోగిస్తున్నట్లు 69 డీబీఎం డీఈ శోభారాణి తెలిపారు. 
 
 
 
మరిన్ని వార్తలు