తిరుమల ఆలయంలో గోకులాష్టమి

22 Aug, 2016 19:43 IST|Sakshi

- ఆరు గంటల్లో శ్రీవారి దర్శనం

తిరుమల: తిరుమలలో ఈ నెల 25వ తేదీన గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు బంగారు వాకిలిలో వైదికంగా ఈ ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఏకాంతంగా తిరుమంజనం నిర్వహిస్తారు.

అనంతరం 26వ తేదిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప సమయంలో ఆలయ పురవీధుల్లో ఉట్లోత్సవం నిర్వహిస్తారు. 26న నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది. ఉత్సవానికి అవసరమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

ఆరు గంటల్లో శ్రీవారి దర్శనం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తగ్గింది. సాయంత్రం 6 గంటల వరకు 56,879 మంది శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 16 కంపార్ట్‌మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 6 గంటలు, 4 కంపార్ట్‌మెంట్లలోని కాలిబాట భక్తులకు 4గంటలు సమయం తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ ఉన్నాయి. హుండీ కానుకలు రూ.3.13 కోట్లు లభించింది.
 

మరిన్ని వార్తలు