మంచి లక్షణాలు అలవడేలా కృషిచేయాలి

21 Jul, 2016 00:11 IST|Sakshi
విద్యార్థులతో మాట్లాడుతున్న జేసీ దివ్య
  • బడి, గుడి, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి
  • జాయింట్‌ కలెక్టర్‌ దివ్య
  • ఖమ్మం అర్బన్‌ : బాల్యం నుంచే చిన్నారులకు మంచి లక్షణాలు అలవడేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దివ్య అన్నారు. బుధవారం నగరం 7వ డివిజన్‌లోని రుద్రమకోటలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన హరితహారంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థుల ప్రగతిపై ఆరాతీశారు. బడి, గుడి, ఏదైనా ఖాళీ ప్రదేశాల్లో ఇంటి అవసరాలకు ఉపయోగపడే, నీడనిచ్చే మొక్కలను విరివిరిగా నాటాలని సూచించారు. మొక్కల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి వాటినినాటించడంతోపాటు, వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి గ్రామాల్లోని పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి, వాటిని వృక్షాలుగా మార్చాలని కోరారు. ఈ సందర్భంగా పాఠ్యాంశాలపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. దాతల సహాయంతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ పెట్టి విద్యార్థులకు శుద్ధి చేసిన నీరు అందించాలని కార్పొరేటర్‌ నాగేశ్వరరావుకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ వెంకారెడ్డి, తెలంగాణ గ్రామ రెవెన్యూ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరిక ఉపేందర్, ఆర్‌ఐలు రామకృష్ణ, వాహిద్, పాఠశాల హెచ్‌ఎం జయరాం, వీఆర్‌ఓలు బాలయ్య, ఆనందరావు, కృష్ణ, రామచంద్ర, నాగేశ్వరరావు, వీరబాబు, ఉపాధ్యాయులు పద్మావతి పాల్గొన్నారు.
     

>
మరిన్ని వార్తలు