బుల్లితెరకు ప్రభుత్వ ప్రోత్సాహం

24 Aug, 2016 08:51 IST|Sakshi
స్వామిగౌడ్‌ చేతులమీదుగా పురస్కారాన్ని అందుకుంటున్న జర్నలిస్ట్‌ స్వప్న, న్యూస్‌ రీడర్‌ కిషోర్‌

సాక్షి, సిటీబ్యూరో:  బుల్లితెరకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని శాసనమండలి చైర్మన్‌ కనకమామిడి స్వామిగౌడ్‌ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన బుల్లితెర పెద్ద పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పద్మమోహన 26వ వార్షికోత్సవం సందర్భంగా ఆరవ పద్మమోహన టీవీ అవార్డ్స్‌–2016 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కళలు, కళాకారులు, టీవీ, సినీ రంగాల్లో పనిచేసే వారికి గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తోందని చెప్పారు. టీవీ రంగం అభివృద్ధికి అందులో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం మద్దతుగా ఉంటోందన్నారు.

టీఎస్‌ఎల్‌సీ డిప్యూటీ లీడర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ టీవీ రంగంలో పనిచేసేవారి కోసం ప్రభుత్వం టీవీ నగర్‌ ఎస్టాబ్లిష్‌ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అన్ని రకాల సౌకర్యాలు తక్షణమే కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ అవార్డ్స్‌ బాధ్యతలను పెంచుతాయన్నారు. సినీ ప్రొడ్యూసర్‌ కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ పద్మమోహన సంస్థ నిర్వాహకులు సాంస్కృతిక సేవే కాకుండా ప్రజాసేవ కూడా చేయాలని సూచించారు. ప్రత్యేక సత్కారాన్ని సాక్షి టీవీ జర్నలిస్టు స్వప్న అందు కున్నారు.

బెస్ట్‌ న్యూస్‌ రీడర్‌ అవార్డ్‌ను సాక్షి టీవీ న్యూస్‌ రీడర్‌ డీవీఎన్‌ కిషోర్‌ అందుకున్నారు.అనంతరం ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ ఎ.గురురాజ్‌కి పద్మమోహన్‌ ప్రతిభా పురస్కా రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్స్, స్పెషల్‌ జూరీ అవార్డ్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఫిల్మ్‌ యాక్టర్‌ సంపూర్ణేష్‌బాబు, టీ న్యూస్‌ ఎండీ జె.సంతోష్‌ కుమార్, కేఎంఆర్‌ ఎస్టేట్‌ ఎండీ కె.మాధవరెడ్డి, పద్మమోహన వ్యవస్థాపకుడు డి.యాదగిరిగౌడ్‌ పాల్గొన్నారు.


 

>
మరిన్ని వార్తలు