ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

2 Jan, 2017 01:54 IST|Sakshi

నకిరేకల్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని రాష్ట్ర విద్యుత్, షెడ్యూల్‌ కులాల శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నకిరేకల్‌లోని నారాయణరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నకిరేకల్, కట్టంగూర్, చిట్యాల, మండలాల్లో కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిపొందిన 86మందికి రూ.51వేల చొప్పున రూ.43.86లక్షలు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణలక్షి పథకం ఎన్నికల హామీ కాదు..ఎవ్వరు కూడా అడగలేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల నుంచి పుట్టిందన్నారు. ఈ పథకం ద్వారా ఏ ఇంట్లో కూడా ఆడపిల్ల పుట్టిన మనింటికి కళ్యాణ లక్ష్మి వస్తుందని అనుకోవాలని సూచించారు. కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ మాట్లాడుతూ జిల్లాలో కల్యాణ లక్ష్మి కింద 2500 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మొదటి విడుతలో 1300మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. రెండవ విడుతలో కూడా మిగితా వారికి చెక్కులు ఇస్తామన్నారు. ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ నివారణ, శిశువిక్రయాలకు వ్యతిరేకంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతామన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిల కోసం సీఎం కేసీఆర్‌ కళ్యాణ లక్ష్మి పేరుతో రూ.51వేలు ఇవ్వడం గొప్పవిషయం అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఆడపిల్లల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ఒక పెద్దకొడుకులాగా ఉండి వారి వివాహాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు.

నల్లగొండ ఆర్డీఓ వెంకటచారి అధ్యక్షతన జరిగిన  కార్యక్రమంలో జేసీ నారాయణరెడ్డి, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ సుజాత యాదయ్య, ఎంపీపీలు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, గుత్త మంజుల, కొండ లింగస్వామి, జెడ్పీటీసీలు పెండెం ధనలక్ష్మి సదానందం, శేపూరి రవీందర్,  తహసీల్దార్లు అంబేద్కర్, ప్రమీళ, పుష్పలత, సర్పంచ్‌లు పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, దుబ్బాక మంగమ్మ,  ఎంపీటీసీలు రాచకొండ వెంకన్న, సైదారెడ్డి, మమత, సరిత తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు