'డబ్బే ముఖ్యం కాదు'

30 Mar, 2016 18:58 IST|Sakshi
'డబ్బే ముఖ్యం కాదు'

విజయవాడ :  గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు ఉండే చిరునవ్వు భవిష్యత్తులో రోగులను చూసేటప్పుడు కూడా ఉండాలని వైద్యులకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. బుధవారం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.... డబ్బే ముఖ్యం కాదని వైద్యులకు ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు.

వైద్యులను రోగులు దేవుళ్లుగా భావిస్తారని తెలిపారు. వారి నమ్మకాలను వమ్ము చేయవద్దు అంటూ వైద్యులకు చెప్పారు. ఆసుపత్రికి వెళ్లాలంటే సామన్య ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండేళ్ల పాటు గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేయాలని పట్టా తీసుకున్న వైద్యులను అర్థిస్తున్నానని గవర్నర్ నరసింహన్ అన్నారు.

>
మరిన్ని వార్తలు