ఊరి నుంచి పంపేయండి

16 Feb, 2016 07:07 IST|Sakshi
ఊరి నుంచి పంపేయండి

మద్యం సేవించిన వాళ్లను తరిమేయండి 
గిరిజన మహిళలకు గవర్నర్ ఉద్బోధ

 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మద్యం సేవించి ఇబ్బంది పెడుతున్నవాళ్లను ఊరినుంచి బయటకు పంపించేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గిరిజన మహిళలకు ఉద్బోధ చేశారు. చదువు మానేసి ఖాళీగా ఉన్న పిల్లలతో మాట్లాడొద్దని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ దంపతులు సోమవారం సీతంపేటలోని ఐటీడీఏను రెండోరోజు సందర్శించారు. అక్కడకు వచ్చిన గిరిజన మిహ ళల కష్టసుఖాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ఊళ్లో ఎంతమంది మహిళలుంటున్నారు, ఏ పనులు చేస్తున్నారు, సంపాదన, ఖర్చెం త ఉంటోంది, పిల్లల బాగోగుల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తున్నారన్న విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలలు, వాటిల్లో చదువుకుంటున్న పిల్లల సంఖ్య, డ్రాపౌట్స్ తదితర వివరాల్ని ఐటీడీఏ పీఓ జె.వెంకటరావు సమక్షంలో అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు లింకేజీలు, స్వయం శక్తి సంఘాల సభ్యుల పరిస్థితి అంశాపై అధికారులతో ఆరా తీశారు. గవర్నర్ సతీమణి కూడా గిరిజన మహిళలతో మాట్లాడారు. మీ సంపాదన తక్కువగా ఉంటోంది, అందులో కొంత సొమ్మును మీ భర్తలు మద్యానికే తగలేస్తుంటే మీరెలా బాగుపడతారని సీతంపేటకు చెందిన రాధమ్మ అనే మహిళనుద్దేశించి కలెక్టర్, గవర్నర్ అడిగారు. సొమ్ము భద్రపర్చుకుంటే ఆదాయం రెండింతలవుతుందని సూచించారు.

మరిన్ని వార్తలు