సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం

4 Sep, 2016 21:29 IST|Sakshi
సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
రామన్నపేట : ప్రభుత్వవైఫల్యం వల్లనే ధర్మారెడ్డిపల్లికాలువ ద్వారా రైతులకు సాగునీరు అందడంలేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఆదివారం రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాలకు చెందిన పార్టీనాయకులు, రైతులతో కలిసి ధర్మారెడ్డిపల్లి కాలువవెంట ఆయన పర్యటించారు. గోకారం చెరువువద్ద తలుపులకు తట్టినచెత్తను, తూముకు అడ్డంగాపడిన రేకును తొలగించారు. ధర్మారెడ్డిపల్లి కత్వవద్ద నీటిప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం రామన్నపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు మండలాలకు సాగునీరుఅందించే ధర్మారెడ్డిపల్లి కాలువకు నీటిని తీసుకురావడంలో స్థానిక ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కొరవడిందన్నారు. ఆయనవెంట జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, చిట్యాల మండలకాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, మాజీఎంపీపీ నీల దయాకర్, వైస్‌ఎంపీపీ బద్దుల ఉమారమేష్, సర్పంచ్‌ బొక్క భూపాల్‌రెడ్డి, జిట్ట బొందయ్య,  జడల ఆదిమల్లయ్య, బండమీది స్వామి, మీర్జా బషీర్‌బేగ్, బొడ్డు అల్లయ్య, కన్నెబోయిన సైదులుయాదవ్, ఏళ్ల వెంకట్‌ రెడ్డి, కట్టంగూరి మల్లేశం, ఎండీ.జమీరుద్దిన్, దొమ్మాటి లింగారెడ్డి, బండ అంజిరెడ్డి, లింగస్వామి, సతీష్, సైదులు ఉన్నారు.
 
>
మరిన్ని వార్తలు