రైతులను విస్మరించిన ప్రభుత్వం

4 Oct, 2016 23:45 IST|Sakshi
రైతులను విస్మరించిన ప్రభుత్వం
తిప్పర్తి : పూర్తిస్థాయి రుణమాఫీ చేయకుండా.. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించిందని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం తిప్పర్తి మండలం రాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. రైతులను పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధుల జీతాలు పెంచి ఏం ఘనకార్యం సాధించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. రెండేళ్లుగా రైతులు కరువుతో ఇబ్బందులు పడ్డ రైతుల కష్టాలను పట్టించుకునే దిక్కే లేకుండా అయ్యిందన్నారు. తనకు పదవీ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటూ పేదల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని.. ఇంత దరిద్రమైన పాలన ఎక్కడా, ఎప్పుడూ లేదన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, జూకురి రమేష్, వెంకట్‌రాంరెడ్డి, కోఆప్షన్‌ అబ్దుల్‌ రహీం, సంకు ధనలక్ష్మి, మెరుగు వెంకన్న, మర్రి యాదయ్య, జానయ్య, ప్రసాద్, శంకర పరశురాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు