రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: బొత్స

19 Nov, 2015 13:40 IST|Sakshi
రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: బొత్స

హైదరాబాద్: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరముందని వైఎస్ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఆయన గురువారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వర్షాలతో ఆంధప్రదేశ్‌లో నెలకొన్న దుర్భర పరిస్థితులను వివరించారు.

వర్షాలతో జాతీయ రహదారులు బాగా దెబ్బతిని.. ప్రజారవాణాకు ఆటంకం కలుగుతున్నదని పేర్కొన్నారు. వర్ష ప్రభావిత జిల్లాల్ల వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే మాట్లాడారని, బాధిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారని తెలిపారు. వైఎస్ జగన్ వర్ష ప్రభావిత జిల్లాల్లో పర్యటించి.. బాధితులకు భరోసా ఇవ్వనున్నారని చెప్పారు.

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. పరిస్థితిని గమనిస్తే తుపాన్‌ సూచన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు ఏవీ ప్రభుత్వం చేపట్టలేదని తెలుస్తున్నదని చెప్పారు. వర్షా ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వసాయం పట్ల ద్వేషం, కక్షం ఉందని, అయితే ప్రస్తుతం వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి నెలకున్న తరుణంలో వర్షాల బారిన పడిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు