గజలక్ష్మికి ఘన వీడ్కోలు

12 Dec, 2016 14:55 IST|Sakshi
గజలక్ష్మికి ఘన వీడ్కోలు

మంత్రాలయం : 36 ఏళ్లు  రాఘవేంద్ర స్వామి సేవలు తరించిన గజలక్ష్మికి శ్రీమఠం ఘన వీడ్కోలు పలికింది. అటవీ శాఖ నిర్ణయం మేరకు శ్రీమఠం పీఠాధిపతులు సుబుదేంద్ర తీర్థులు నేతృత్వంలో ఆదివారం సాగనంపారు. çగజలక్ష్మికి పవిత్ర స్నానం చేయించి శ్రీమఠానికి తీసుకొచ్చారు. పీఠాధిపతి అలంకార శేషవస్త్రం కప్పి మాలలతో అలంకరించి వేదమంత్రోఛ్చారణల మధ్య విశేష పూజలు గావించారు. రాగి ముద్దలు, చెరుకు గడలు, అరటి పండ్లు నైవేద్య ఆహారంగా అందించారు. భక్తజన సంద్రం మధ్య  మాడావీధుల్లో  ఊరేగించారు. గజలక్ష్మి తొండంతో పీఠాధిపతికి ఆఖరి మాలధారణ గావించి టీటీడీ దేవస్థానం జంతు ప్రదర్శన శాల అధికారుల అప్పగింతలు కానిచ్చారు.   ప్రత్యేక లారీలో టీటీడీ అధికారులు గజలక్ష్మిని తీసుకెళ్లారు. పీఠాధిపతి పూర్వ అస్తమ తండ్రి, పండితకేసరి గిరియాచార్‌ , మఠం మేనేజర్‌ శ్రీనివాస రావు, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతిఆచార్, ధార్మికసహాయక అ«ధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు