ఐదు గ్రావెల్‌ టిప్పర్ల సీజ్‌

17 Jul, 2016 21:09 IST|Sakshi
ఐదు గ్రావెల్‌ టిప్పర్ల సీజ్‌
 
తడ: రవాణా శాఖ ప్రత్యేక అధికారుల బందం శనివారం రాత్రి తడలో తనిఖీలు నిర్వహించి ఐదు గ్రావెల్‌ టిప్పర్‌లను సీజ్‌ చేశారు. సరైన పత్రాలు లేకుండా ఓవర్‌లోడ్‌తో పొరుగు రాష్ట్రానికి వెళుతున్న ఈ టిప్పర్‌లకు రూ.16 వేలు చొప్పున జరిమానా విధించి తడ పోలీసులకు అప్పగించారు. నిత్యం చిత్లూరు జిల్లా నుంచి పదుల సంఖ్యలో టిప్పర్లు తడ మీదుగా తమిళనాడుకు గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తుంటాయి. తమిళనాడులో గ్రావెల్‌కు డిమాండ్‌ ఉండటంతో అధికార పార్టీ అండదండలున్న పలువురు యథచ్ఛేగా గ్రావెల్‌ను సరిహద్దు దాటించేస్తున్నారు. చెక్‌పోస్టులో మైనింగ్‌ శాఖకు సంబంధించి ఒక్కరే విధుల్లో ఉండటం వీరికి వరంగా మారింది. రోడ్డుపైకి వచ్చి వాహనాలను తనిఖీ చేసే పరిస్థితి లేకపోవడంతో తేలికగా తప్పించుకెళ్లిపోతున్నారు. ప్రత్యేక తనిఖీ బందాలు వచ్చిన సమయంలోనే ఈ అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వస్తోంది. 
 
మరిన్ని వార్తలు