అపరభగీరథుడు కేసీఆర్‌

23 Aug, 2016 22:23 IST|Sakshi
కరీంనగర్‌ :  తెలంగాణలోని కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో మహహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపరభగీరథుడు అని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. మహా ఒప్పందం పూర్తయిన సందర్భంగా కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌లో సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కటౌట్లను నాయకులు ఏర్పాటు చేసి మంచినీటి ట్యాంకర్లతో పైపుల ద్వారా నీళ్లను కటౌట్లపై పంపిస్తూ టపాసులు కాల్చారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా అధ్యక్షులు ఈద శంకర్‌రెడ్డి, మేయర్‌ రవీందర్‌సింగ్‌ మాట్లాడుతూ గోదావరినీళ్లతో తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన కృషి ఫలించిందని, దీంతో తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు గోదావరినీళ్లు అందనున్నాయని అన్నారు. ఆరు దశాబ్దాలుగా అంతర్‌రాష్ట్ర వివాదాల మూలంగా ప్రాజెక్టుల నిర్మాణానికి నోచుకోలేదని తెలిపారు. గోదావరిపై మేడిగడ్డ బ్యారేజీ, ప్రాణహితపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ, పెన్‌గంగపై చనాక–కొరాట బ్యారేజీ నిర్మాణానికి అవరోధాలుతొలిగిపోయాయని అన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్, ఓరుగంటి ఆనంద్, వై.సునీల్‌రావు, ఎడ్ల అశోక్, కట్ల సతీశ్, చల్ల హరిశంకర్, పెద్దపల్లి రవీందర్, బోనాల శ్రీకాంత్, నలువాల రవీందర్, తిరుపతినాయక్, మైఖేల్‌ శ్రీను, ఆనంతుల రమేశ్, ప్రిన్స్‌రాజు, కలర్‌ సత్తెన్న తదితరులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు