మాతాన్నపూర్ణేశ్వరీ...

3 Oct, 2016 17:11 IST|Sakshi
మాతాన్నపూర్ణేశ్వరీ...
–ఆకలిగొన్నవారిని ఆదుకుంటోన్న అన్నపూర్ణ సేవా ఫౌండేషన్‌
–జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచిత అన్నప్రసాద వితరణ
–అడిగి మరీ కడుపారా అన్నం పెడుతున్న మనసున్న మారాజులు
 
 
ఏలూరు అర్బన్‌ ః
అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే భగవాన్‌ సత్యసాయి మాటలు  సత్యసాయి సేవా సమితి నగర కమిటీ సభ్యుల్లో స్ఫూర్తిని నింపాయి. సమాజంలో ఆపన్నులను ఆదుకోవాలనే ఆలోచన రేకెత్తించాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిందే సత్యసాయి అన్నపూర్ణ సేవా ఫౌండేషన్‌. అలా రూపుదిద్దుకున్న ఆ ఫౌండేషన్‌ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నిత్యం వందలాదిమంది పేద రోగుల సహాయకుల ఆకలి బాధ తీరుస్తోంది. 
జిల్లా కేంద్రం ఏలూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో  సత్యసాయి అన్నపూర్ణ సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సత్యసాయి అన్నపూర్ణ సేవా ఫౌండేషన్‌ పేరిట ఫిబ్రవరి 1, 2015లో ప్రారంభమైన సేవా సంస్థ నిత్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగుల సహాయకులకు నిత్యం ఆప్యాయంగా అన్నప్రసాద వితరణ చేస్తూ ఆకలి తీరుస్తోంది. నిత్యం సుమారు 300 మంది ఆకలిపీడితులకు షడ్రుచులతో కడుపారా అన్నం పెడుతోంది. సేవా తత్పరత కలిగిన ఫౌండేషన్‌ సభ్యులు ఉదయమే ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో కలియతిరిగి అమ్మా భోజనం చేస్తారా అని అడిగిమరీ వారికి కూపన్లు అందిస్తారు. అలా ఎందరికి కూçపన్లు ఇచ్చారో అంతమందికి సరిపడా అన్నం, కూర, సాంబారు, పచ్చడి, పెరుగు సి«ధ్ధం చేసి మధ్యాహ్నం గం.11.30 నుంచి గం 1 వరకూ అన్నప్రసాద వితరణ చేస్తుంటారు. ఇక ఎవరైనా దాతలు వారి ఇళ్ళల్లో జరుపుకునే వేడుకల సందర్భంగా ముందుకు వచ్చి ఏదైనా తీపి వంటకాలు అందిస్తే దానిని కూడా అన్నార్తులకు అందిస్తుంటారు. ఇలా నిత్యం ఎందరో పేదలకు కడుపారా మష్టాన్న భోజనం అందించడం ద్వారా ఆత్మ సంతప్తి  ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పొందుతున్నారు. 
– అన్నదాతా సుఖీభవ. 
రంపాడ. రామాయమ్మ. వంగాయగూడెం.
రోజులు మారాయి. ఇంటికి ఎవరైనా బంధువు వస్తే వారికి ఒక పూట భోజనం పెట్టేందుకు ఆలోచించాల్సిన కరువు రోజులివి. అలాంటిది మేమెవరిమో వాళ్ళెవరో మాకు తెలీదు. ఆసుపత్రిలో వార్డులోకి వచ్చి మరీ అమ్మా భోజనం చేస్తావా అని అడిగిమరీ  మూడు రోజుల నుంచి భోజనం పెడుతున్నారు. వాళ్ళు  చల్లగా ఉండాలి.
– వారి దయవల్లే కడుపు నిండుతోంది.
పాము. సుబ్రహ్మణ్యం, పడమట పాలెం, కైకలూరు మండలం.
కూతురిని ప్రసవానికి తీసుకువచ్చాను. కూలి పనులే మా కుటుంబానికి ఆధారం. ఆసుపత్రిలో కూతురివద్ద ఉండడంతో పనికి పోయి కూలి తెచ్చుకునే అవకాశం లేదు. డబ్బులు లేవు ఈ పరిస్థితుల్లో సమాజం వాళ్ళు పిలిచిమరీ కడుపునింపుతున్నారు. వారికి ఎంతైనా రుణ పడి ఉన్నాం.
–  రెండు పూటలా భోజనం అందించాలనేది లక్ష్యం.
కానుమిల్లి. శశి శేఖరరావు, నందిగం. సత్యనారాయణ,ఫౌండేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు.
నిధులు పరిమితంగా ఉండడంతో రోగుల సహాయకులకు మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం పెట్టగలుగుతున్నాం. అన్న ప్రసాద వితరణ కోసం మేము ఎవరినుంచీ ఆర్ధిక సహాయం అర్ధించం. దాతలు స్వఛ్ఛంధంగా ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందిస్తే స్వీకరిస్తున్నాం. ఈ నేపథ్యంలో దాతలెవరైనా ముందుకు వస్తే వారి నుంచి విరాళాలు సేకరించి కార్పస్‌ఫండ్‌ ఏర్పాటుచేసి దానిపై వచ్చే ఆదాయంతో ఇకపై రెండుపూటలా భోజనం పెట్టాలని భావిస్తున్నాం. త్వరలో అమలు చేసేందుకు చర్యలు  ప్రారంభించాం. ఇప్పటికే ఆసుపత్రిలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి అతిధి దేవుళ్ళ సేవ చేసుకుంటున్నాం.
 
 
 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా