చెట్టు అమ్మ లాంటిది: డాక్టర్ కేవీ రమణాచారి

21 Jul, 2016 18:56 IST|Sakshi

చెట్టు అమ్మ లాంటిదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి తెలిపారు. గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సి బాధ్యత మనదేనన్నారు.

 

ప్రకృతి సమతుల్యత ఉంది అంటే దానికి కారణం చెట్టేనని చెప్పారు. ఎప్పుడో మన పెద్దలు నాటిన మొక్కలతో మనం ఎంతో లబ్ధిపొందుతున్నామన్నారు. ఇప్పుడు నాటే మొక్కలు 20 ఏళ్ల తర్వాత ఫలితాలను మన భావితరాలకు అందిస్తాయని తెలిపారు. ఎంతోమంది కవులు, గాయకులు కూడా చెట్టు ప్రాధాన్యత విశదీకరించారన్నారు. సీఎం మందుచూపుతో ఎంతో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

 

ప్రభుత్వంలోని ప్రతిశాఖ మరో మూడు నెలల పాటు చెట్లను నాటడం వాటిని రక్షించటం చేయాలని తెలిపారు. చెట్లపై సారధి కళాకారిణి స్పందన బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఇన్‌చార్జ్ ఏవో మనోహర ప్రసాద్, రవీంద్రభారతి, సాంస్కృతిక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు