ప్రజా భాగస్వామ్యంతోనే గ్రీనరీ

28 Jul, 2016 22:42 IST|Sakshi
ప్రజా భాగస్వామ్యంతోనే గ్రీనరీ
  •   సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌వో రామ్‌ మోహన్‌రావు 
  • గుంటూరు వెస్ట్‌ : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యం ద్వారానే గ్రీనరీ సాధ్యమని సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌వో 
    పి.రామ్‌ మోహన్‌రావు తెలిపారు. 2016లో అటవీశాఖ జిల్లాలో కోటీ 7 లక్షల మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈనెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమ వివరాలను ఆయన వివరించారు. జిల్లాలో విస్తీర్ణంలో 14.58 శాతం అడవులు ఉన్నట్లు తెలిపారు. అటవీ విస్తీర్ణం పెంచే కార్యక్రమంలో భాగంగా 29వ తేదీన జిల్లావ్యాప్తంగా 11 లక్షల 31 వేలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నల్లపాడులోని నగరవనంలో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. మొక్కలను పెంచాలని ఆసక్తి కలిగినవారు 1800 425 3252 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని, అవసరమైన మొక్కలను తీసుకుని వెళ్లవచ్చని ఆయన సూచించారు.
     
     
     
మరిన్ని వార్తలు