ప్రకృతి‘రక్షక’ నిలయం

6 Sep, 2016 23:51 IST|Sakshi
ప్రకృతి‘రక్షక’ నిలయం
  • పోలీస్‌స్టేషన్‌ ఆవరణ అలుముకున్న పచ్చదనం
  • పూలు, పండ్ల మొక్కల పెంపకం
  • పార్కును తలపిస్తున్న వైనం
  •  
    ప్రకృతిపై ప్రేమ చూపితే ఆ ప్రాంతమంతా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆ ప్రదేశానికి వెళ్లాలి. నీడ నిచ్చే నేస్తాలను అక్కడి వారు కాపాడారు. ఫలితం హరితశోభితం... నందనవనం.. ప్రభుత్వ నిర్వహించే పార్కులను మైమరిపించే పచ్చదనం ఆ ప్రాంతం సొంతం. ఆ ఆవరణమంతా పచ్చదనం పరుచుకుంది. పూల, పండ్ల, మొక్కలు కృతజ్ఞతగా వాటి ఫలాలను వారికి అందిస్తున్నాయి. ప్రకృతికి వారు కొంత తోడ్పాటు నిచ్చారు. ప్రకృతి మాత్రం వారి చాలా ఇస్తోంది. నీడనిస్తోంది. ఫలాలనిస్తోంది. స్వచ్ఛమైన గాలినిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఈ హరితవనం ఎక్కడో.. ఏ మూలనో లేదు.
           బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లోనే. స్టేషన్‌లోకి అడుగిడినప్పుడు గమనిస్తే చుట్టూ అంతా పచ్చదనమే. అనేక పూల, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, రకరకాల వృక్ష జాతులు స్టేషన్‌ ఆవరణలో సిబ్బంది నాటారు.  స్టేషన్‌లో పచ్చదనం పరుచుకోవడం వెనుక గతంలో పని చేసిన ఎసై ్స చంద్రశేఖర్‌ కృషి అధికం. తదనంతరం వచ్చిన ప్రమోద్‌రావు చేసిన సేవలు ప్రశంసనీయం. ప్రస్తుత విధులు నిర్వహిస్తున్న ఎసై ్స ఆకుల శ్రీనాథ్‌ సైతం వారి బాటలోనే నడుస్తూ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణాన్ని హరితశోభితం చేస్తున్నారు. 
    – బజార్‌హత్నూర్‌
     
     
మరిన్ని వార్తలు