గ్రీవెన్స్‌ ఆర్జీలు వెంటనే పరిష్కరించాలి

22 Aug, 2016 23:59 IST|Sakshi
వినతి పత్రాలు స్వీకరిస్తున్న కలెక్టర్,జేసీ
  • కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌ : ప్రతి సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌కు వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ దివ్య,ఏజేసీ శివశ్రీనివాస్‌లతో కలసి ప్రజల నుంచి  వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డివిజన్, మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించిన నివేదికలను అందజేయాలని చెప్పారు. ప్రజలు సమర్పించిన ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి సమీక్షించనున్నట్లు చెప్పారు.
    • రేపు టీటీడీసీలో సమావేశం..
    జిల్లాలో ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక చట్టం ద్వారా మంజూరు చేయబడిన నిధుల్లో చేసిన ఖర్చులకు,మిగిలిన నిధులకు సంబంధించిన సమగ్ర నివేదికలను తయారు చేసి 23వ తేదీ మంగళవారం ఉదయం పదకొండు గంటలకు టీటీడీసీలో నిర్వహించే సమావేశానికి అధికారులు హాజరుకావాలని చెప్పారు. కార్యక్రమంలో  జాయింట్‌ కలెక్టర్‌ దేవరాజన్‌దివ్య,అదనపు జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్, బీసీ కార్పొరేషన్‌ ఆంజనేయశర్మ, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు