పెరుగుతున్న గోదారి

12 Sep, 2016 23:03 IST|Sakshi
తాలిపేరు వాగులోకి వస్తున్న గోదావరి బ్యాక్‌వాటర్‌
  • తాలిపేరు నుంచి బ్యాక్‌వాటర్‌
  •  
    చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంతో పాటు గోదావరి ఎగువ ప్రాంతం మహారాష్ట్రాలో నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది వరద ఉధృతి పెరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాలోని అటవీప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెదమిడిసిలేరు సమీపంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో మూడురోజులుగా పెద్ద ఎత్తున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు తాలిపేరు నీరు.. అటు గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదనీటితో ఆదివారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి బాగా పెరుగుతోంది. మండలంలోని తేగడ వద్ద తాలిపేరు వాగు, కుదునూరు సమీపంలోని జోడిచీలికల వాగు ద్వారా గోదావరి బ్యాక్‌వాటర్‌ వచ్చి వాగులో చేరుతోంది. ఆయా వాగుల సమీపంలోని వరి, మిర్చి, పత్తి పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి పెరిగితే పంటలు నీటముగినే ప్రమాదం ఉండటంతో రైతులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. తాలిపేరు వాగు ద్వారా వచ్చిన బ్యాక్‌వాటర్‌తో తేగడలో తాలిపేరు వాగుపై ఉన్న లోలెవల్‌ చప్టా నీటమునిగే అవకాశం ఉంది. 
మరిన్ని వార్తలు