సీఎం హామీలు అమలు చేయరా..?

3 Nov, 2016 01:27 IST|Sakshi
సీఎం హామీలు అమలు చేయరా..?

పర్యవేక్షణ లేకనే పనుల్లో జాప్యం
ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ అసంతృప్తి

హన్మకొండఅర్బన్ : సీఎం కేసీఆర్ జిల్లాకు ఇచ్చిన హామీల అమలుపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యేల తీరును కూడా తప్పుపట్టారు. సీఎం కేసీఆర్ నగరంలోని తొమ్మిది చోట్ల ప్రారంభోత్సవాలు చేస్తే ఒక్క చోట కూడా పనులు పూర్తి కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గ్రేటర్ పరిధిలో 7వేలకు పైగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తే అధికారులు పనులు సాగతీయడం సరికాదన్నారు. పనులను దగ్గరుండి పూర్తి చేరుుంచాల్సిన ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. మీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సీఎం ప్రారం భోత్సవం చేసిన తర్వాత దానికి సంబంధించి పనులు అగిపోతే చూడాల్సిన బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. పని తీవ్రతను బట్టి మీరే మాట్లాడి సమస్యను పరిష్కరిచుకోవాలని సూచించారు. నిర్మాణానికి స్థలం అనుకూలంగా లేకపోతే ఆమోదయోగ్యమైన మరో స్థలం పరిశీలించి అనుమతులు తీసుకోవాలన్నారు. కూరగాయల మార్కెట్, పండ్లు, పూలమార్కెట్ స్థలాల ఎంపిక విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలన్నారు.

మిగతా వాటిపై ఇదే ప్రభావం
ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చకుంటే ఈ ప్రభావం ఇతక కార్యక్రమాలపై పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కొన్ని ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తే మిగతా వారు మందుకు వస్తారన్నారు. ఈ విషయంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు సమన్వయంతో ముదుకు వెళ్లాలన్నారు.

మరిన్ని వార్తలు