బోగస్‌ పట్టాలు రద్దు చేయాలని ధర్నా

18 Aug, 2016 00:53 IST|Sakshi
 
ఉదయగిరి: మండలంలోని గుడినరవలో కొంతమంది అధికార పార్టీ నేతలు తమ అనుచరుల పేరుమీద బోగస్‌ పట్టాలు సృష్టించి 30 ఎకరాలు పైగా భూమిని కొట్టేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామస్తులు బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎ దుట ధర్నాకు దిగారు. సుమారు వందమందికిపైగా గ్రామస్తులు ఉదయం పది గంటలకు కార్యాలయానికి చేరుకొని బోగస్‌ పట్టాలను 1బి, అడంగల్‌లో తొలగించి దీనికి బాధ్యులపై వారిపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే తహసీల్దారు కార్యాలయానికి అధికారులెవరూ రాకపోవడంతో వారు అక్కడే బైఠాయించారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ నాగలక్ష్మి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆమె గ్రామస్తుల డిమాండ్ల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వారు అక్కడే బైఠాయించారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆ త్మకూరు ఆర్డీవో ఎన్‌వి.రమణ రావడంతో ఆయన దృష్టికి ఈ విష యం తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. కొన్నేళ్లనుంచి సర్వే నం. 1/3రులో 30 ఎకరాల భూమి రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉందన్నారు. కేవలం నెల రోజుల ముందే కొంతమంది పేర్లు 1బి, అడంగల్‌లో నమోదు చేశారన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్డీవో స్పందిస్తూ రెండు వారాల్లో విచారణ చేసి రకార్డుల్లో పేర్లు తొలగించి గ్రామ అవసరాల నిమిత్తం ఈ భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు ఇన్‌చార్జ్‌ తహశీల్దారు నాగలక్ష్మి, వీఆర్వో రాజశేఖర్, మండల ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసులు, టీడీపీ నాయకులు వెంకటరెడ్డి, గ్రామస్తులున్నారు. 
>
మరిన్ని వార్తలు