అక్రమంగా దాచిన తుపాకి స్వాధీనం

16 Feb, 2017 00:32 IST|Sakshi
ఆత్మకూరురూరల్:  మండల పరిధిలోని నల్లకాల్వ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి ఆత్మకూరు పోలీసులు బుధవారం నాటు తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు సీఐ కృష్ణయ్యకు వచ్చిన  సమాచారం మేరకు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య  నల్లకాల్వలో అనుమానితుడి ఇల్లు సోదా చేశారు. ఈ సోదాలో కంచుతో చేసిన తుపాకి లభ్యమైనట్లు తెలిసింది. దీనితో ఒక తూటా మాత్రమే పేల్చడానికి వీలుంటుందని తెలిసింది. కాగా తుపాకిని దాచిన  వ్యక్తి..దాన్ని తనకు ఓ గిరిజనుడు అమ్మి పెట్టమని ఇచ్చాడని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా పోలీసులు.. నిందితుడిని పూర్తిగా విచారించి  గురువారం అరెస్టు చూపే అవకాశం ఉంది.
 
>
మరిన్ని వార్తలు