గుండ్రేవుల రైతుల ధర్నా

10 Jan, 2017 00:17 IST|Sakshi
కర్నూలు(న్యూసిటీ):   సి.బెళగల్‌ మండలం గుండ్రేవుల పరిధిలో 2015-16వ సంవత్సర పంట నష్టానికి సంబంధించి పరిహారం ఇవ్వాలని గ్రామ రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం సర్పంచు భర్త యోహాన్, రైతులు బి.లింగన్న, బి.తిమ్మప్ప తదితరులు కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుతడి పొలాలు, బీడు, వంకలకు పరిహారం మంజూరు చేసిన అధికారులు నిజంగా పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. వీఆర్‌ఏ, వీఆర్వో, తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి మామూళ్లు తీసుకుని తప్పుడు నివేదికలు ఇచ్చారని, వాటి ప్రకారమే పరిహారం మంజూరైందన్నారు.  కలెక్టర్‌ స్పందించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని కోరారు. ధర్నాలో  రైతులు జి.నగేష్, చిన్నరాముడు, బి.చిన్నబడేసాహెబ్, బి.రాముడు, బి.కమల్, పెద్ద మారెప్ప, కురువ రంగన్న తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు