గురుకుల పేరంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

3 Sep, 2016 23:59 IST|Sakshi
అలంపూర్‌ : న్యూక్యాలిటీ పాలసీ (ఎన్‌క్యూపీ)ని కొనసాగించాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్‌ అసోíసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నతమైన, నాణ్యమైన విద్యను గురుకులాల్లో అందజేయడానికి సాంఘిక, సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఎన్‌క్యూపీ విధానాన్ని ప్రివేశపెట్టారని తెలిపారు. కానీ గురుకుల ఉపాధ్యాయులు ఆందోళనలు చేయడం బాధకరమన్నారు. ఉపాధ్యాయులు ఎన్‌క్యూపీ అమలుకు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, వెంకటమ్మ, మారెన్న, మాజీ ఎంపీటీసీ మద్దిలేటి, రవికుమార్, రామమద్దిలేటి, ఏసన్న, మహేష్, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, కృష్ణ, రవీందర్, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు