-

ముగిసిన గురుకుల క్రీడా పోటీలు

12 Dec, 2016 15:19 IST|Sakshi
బుట్టాయగూడెం : మ ండలంలోని కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి గురుకుల బాలబాలికల క్రీడా పోటీలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 6 వందల మంది బాలబాలికలు పాల్గొన్నారు. జోన్‌ –1, జోన్‌ –2, జోన్‌ –3, జోన్‌ –4 విభాగాల్లో నిర్వహించిన ఈ ఆటల పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. కబడ్డీ, వాలీబాల్, షటిల్, రన్నింగ్, పోటీలు వివిధ జట్టుల మధ్య హోరాహోరీగా సాగాయి. వీటిలో గెలుపొందిన వారి వివరాలను క్రీడా నిర్వహణ అ«ధికారులు వివరించారు. 
విజేతల వివరాలు 
బాలికల 100, 200 మీటర్ల పరుగు పందెంలో బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి పాఠశాల విద్యార్థిని టి.సుమలత, 400 మీటర్ల పరుగుపందెంలో నెల్లూరు జిల్లాకు చెందిన వై.పూజిత, షాట్‌ పుట్‌లో ఆర్‌.నాగేశ్వరి, జావెలిన్‌  త్రోలో ఎ.శ్రావణి(విజయనగరం), డిస్కస్‌ త్రోలో ఎస్‌.శ్రీజ(కూనవరం)విజేతలుగా నిలిచారు. 400 మీటర్ల రిలే పరుగుపందెంలో బూసరాజుపల్లి, కొడవలూరు, రంపచోడవరం పాఠశాల విద్యార్థులు నెగ్గారు. కబడ్డీలో విసన్నపేట గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచారు. వాలీబాల్‌లో విజయనగరం జిల్లా భద్రగిరికి చెందిన విద్యార్థులు గెలుపొందినట్టు తెలిపారు. షటిల్‌ డబుల్స్‌లో రంపచోడవరం విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచారన్నారు. పాఠశాల బాలికల విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌ సగా బూసరాజుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థిని టి.సుమలత, కొలవలూరుకు చెందిన వై.పూజిత విజేతగా నిలిచారు. బాలుర వి«భాగం 100 మీటర్ల పరుగుపందెంలో భ్ర««దlగిరికి చెందిన కామేశ్వరరావు, 200 వందల మీటర్ల పరుగుపందెంలో కొయ్యూరుకు చెందిన భీమరాజు, 400 మీటర్ల పరుగుపందెంలో నెల్లూరు జిల్లా చిట్టేడుకు చెందిన బి.వినోద్, షాట్‌పుట్‌ ఎస్‌.భీమరాజు, డిస్క్‌ త్రో వై.రాజశేఖరరెడ్డి, జావ్లెన్‌ త్రో గురునాయక్‌ శ్రీశైలం విజయం సాధించారు. కబడ్డీలో వైజాగ్‌ జిల్లా అరకుకు చెందిన విద్యార్థులు, వాలీబాల్‌లో జీలుగుమిల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు, షటిల్‌లో రంపచోడవరం విద్యార్థులు, వ్యక్తిగత విభాగంలో కొయ్యూరుకు చెందిన ఎస్‌.భీమరాజు విజేతలుగా నిలిచారు. కళాశాల బాలికల విభాగంలో 100, 200 మీటర్ల పరుగుపందెంలో కూనవరంకు చెందిన ఎస్‌.పుష్పలత, 400 మీటర్లలో కూనవరంకు చెందిన ఆర్‌.మంజుల, షాట్‌పుట్‌ రంపచోడవరానికి చెందిన జె.రమణ, డిస్కస్‌ త్రోలో వై.రామవరానికి చెందిన ఎ.పుష్ప, జావెలిన్‌  త్రోలో వైజాగ్‌ జిల్లా భధ్రగిరికి చెందిన వై.శ్రావణి ప్రథమస్థానంలో నిలిచినట్టు  తెలిపారు. కబడ్డీ, వాలీబాల్‌లో బూసరాజుపల్లి, బూసరాజుపల్లి, బాలుర విభాగంలో వాలీబాల్‌ కేఆర్‌పురం విద్యార్థులు గెలిచినట్టు ప్రకటించారు. విద్యార్థులకు ప్రభుత్వ విప్‌ అంగర రామ్మోహన్‌ రావు, ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్, గురుకుల జాయింట్‌ డైరెక్టర్‌ దేవరవాసు, కేఆర్‌పురం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ బి.మల్లికార్జునరెడ్డి తదితరులు విజేతలకు బహుమతులు అందించారు.  
 
 
 
మరిన్ని వార్తలు