కక్కలేక..మింగలేక

28 Jan, 2017 23:19 IST|Sakshi
  • అనుచరులపై కేసులు పెట్టడంపై ‘సీమ’ నేత అసహనం
  • రాజకీయ గురువు అండ ఉండడంతో పోలీసులను ఏమీ చేయలేకపోతున్న వైనం
  • (లక్కింశెట్టి శ్రీనివాసరావు)
    పైరు పచ్చని కళకళలు.. కొబ్బరాకుల గలగలలతో కేరళను తలపించే సీమ ప్రాంతమది. ఆ ప్రాంత ప్రధాన కేంద్రంలో ఇద్దరు గురుశిషు్యలున్నారు. ఆ ఇద్దరూ అక్కడ రాజ్యమేలుతున్నవారే. సము ద్ర తీరానికి సమీపాన చమురు, సహజవాయు వు ఉత్పత్తి అయ్యే ప్రాంతానికి చెందిన శిషు్య డు ఒకప్పుడు సామాన్యుడు. అప్పట్లో చిన్నచిన్న కాంట్రాక్టులు చేసుకునే పరిస్థితి. అతడి గురువుది కూడా శిషు్యడికి పొరుగున ఉన్న ప్రాంతమే. శిషు్యడు ఎప్పుడూ గురువు వెంటే తిరిగేవాడు. గురువేమో అధికార పార్టీలో పెద్ద నాయకుడు. రాష్ట్రంలో కూడా పెద్ద పదవిలో     ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతో తన స్థాయికి తగ్గట్టు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాడా శిషు్యడు. ఇదే అదునుగా అతగాడి అనుచరుల ఆగడాలు ఇటీవల బాగా పెరిగాయి. వారికి కళ్లెం వేసేందుకు ఓ పోలీసు అధికారి చట్ట ప్రకారం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.
    సొంత పార్టీలో ఇద్దరు నేతలు పోట్లాడుకుంటే నేరం చేసినవాడిపై కేసులు పెట్టాడా ఖాకీ. సీమ కేంద్రానికి సమీపంలో ఓ వ్యక్తిని కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన 15 మంది నిందితుల్లో శిషు్యడి అనుచరుడే కీలక నిందితుడు. ఆ నిందితుడికి స్థానిక సంస్థల పదవి కూడా ఉంది. అతడిని కేసు నుంచి ఎలాగైనా తప్పించాలంటాడు శిషు్యడు. ఆరేడు నెలలుగా అరెస్టు చేయకుండా చూస్తూ వచ్చామంటారు పోలీసులు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలన్న పోలీసు సమక్షంలో గురువుపైనే నోరు పారేసుకున్నాడా ప్రజాప్రతినిధి. అందువల్లనే కేసు బిగించారని శిషు్యడి అనుమానం. గురువు చెప్పకుండా తన అనుచరుడి అరెస్టు వరకూ పోలీసులు వెళ్లి ఉండరనే అనుమానం శిషు్యడికుంది. ఈ నేపథ్యంలో గురువు మెచ్చి తెచ్చుకున్న ఆ పోలీసు అధికారి అంటే శిషు్యడు మండిపడిపోతున్నాడు.
    అయితే గురువు ఇష్టపడి వేయించుకున్న పోలీసు అధికారి కావడంతో.. తన అనుచరులపై కేసులు పెడుతున్నా అతడిని ఏమీ అనలేకపోతున్నాడు. పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని చెప్పలేక, వారిని కేసుల నుంచి బయటపడేసే చేవ లేక, అలాగని గురువును గట్టిగా అడగలేక.. కక్కలేక.. మింగలేక కొట్టుమిట్టాడుతున్నాడు. అతడి వాలకం చూస్తూంటే భవిష్యత్తులో అవకాశం దొరక్కపోతుందా అని కాచుకుని కూర్చున్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయంగా ఓనమాలు నేర్పిన గురువు పైనే బాణం ఎక్కుపెట్టే సాహసం చేస్తాడా అనేది పక్కనబెడదాం. జరుగుతున్న పరిణామాలను మాత్రం అనివార్యంగా భరించాల్సి వస్తోందని సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నాడా శిషు్యడు.
    అలాగని ఆ ఖాకీ అధికారిని వదిలేస్తే ఎలాగని మధనపడిపోతున్నాడు. పోనీ గురువును కాదని అతడిని సాగనంపేంతటి తెగువ శిషు్యడికి ఉందా అంటే అదీ లేదు. కానీ ఏదోరకంగా మంత్రాంగం నడిపైనా అతడిని సీమ కేంద్రం నుంచి తప్పించాలని శిషు్యడు ఎత్తులు వేస్తున్నాడట. అవి ఎంతవరకూ ఫలితాన్నిస్తాయో చూడాల్సిందే మరి! 
     
మరిన్ని వార్తలు