హామీలిచ్చారు.. పత్తాలేరు

12 Dec, 2016 14:41 IST|Sakshi
హామీలిచ్చారు.. పత్తాలేరు

- గడప గడపకు వైఎస్సార్‌లో మహిళల ఆవేదన
బద్వేలు అర్బన్‌:  ఎన్నికల సమయంలో అదిచేస్తాం, ఇదిచేస్తామంటూ ఏవేవో హామీలు ఇచ్చిన టీడీపీ నాయకులు గెలిచి రెండున్నరేళ్లకాలం అవుతున్నా  వార్డువైపు కన్నెత్తికూడా చూడకుండా పత్తాలేకుండా పోయారని మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులోని కృష్ణా కాంప్లెక్స్‌లైన్,  ఓబుళమ్మ కాంప్లెక్స్‌లైన్, కోదండరామరైస్‌ మిల్లు లైన్‌ మహిళలు  వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఎదుట వాపోయారు.  బుధవారం వార్డు పరిధిలోని ఆయా కాలనీలలో  నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్‌  లో ప్రజలు తమ సమస్యలను వివరించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటే నమ్మి రుణాలు చెల్లించడం లేదని ఇప్పుడేమో బ్యాంక్‌ అధికారులు రుణాలు చెల్లించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తున్నారని మహిళలు వాపోయారు. అలాగే పక్కాగృహాల కోసం రెండేళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. అనంతరం డాక్టర్‌ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన పేదలకు ఏ ఒక్క పథకం అందడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, బ్రాహ్మణపల్లె సింగిల్‌ విండో అధ్యక్షుడు గుర్రంపాటి సుందరరామిరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి కొండు శేఖర్‌రెడ్డి ,  కౌన్సిలర్‌ గోపాలస్వామి, మున్సిపాలిటీ కన్వీనర్‌ కరిముల్లా , 8వ వార్డు ఇన్‌చార్జి రాము, మడకలవారిపల్లె , తిరువెంగళాపురం మాజీ సర్పంచ్‌ ఆదిశేషయ్య, రఘురామిరెడ్డి,   నాయకులు చెన్నయ్య, యద్దారెడ్డి, గాజులపల్లె కేశవరెడ్డి ,సాంబశివారెడ్డి, రఘురామిరెడ్డి, బండి వెంకటసుబ్బయ్య, సుబ్బరాజ,  ఎల్లారెడ్డి,గంగులయ్య,  సిద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.  
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



 

మరిన్ని వార్తలు