ముగిసిన హేండ్‌బాల్‌ పోటీలు

9 Nov, 2016 00:38 IST|Sakshi
ముగిసిన హేండ్‌బాల్‌ పోటీలు
చింతలపూడి : నన్నయ విశ్వ విద్యాలయం పరిధిలోని కళాశాలలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రెండు రోజులపాటు నిర్వహించిన హేండ్‌బాల్‌ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన 16 మందిని యూనివర్సిటీ టీమ్‌కు ఎంపిక చేసినట్టు పీడీ కె.నాగమణి తెలిపారు. జట్టు వివరాలు తెలిపారు. ఆర్‌.ఏసురత్నం(కాకినాడ ఐడియల్‌ కలాశాల), పి.జగదీష్‌(రామచంద్రాపురం వీఎస్‌ఎం కళాశాల), ఐ. ఉదయ్‌ భాస్కర్‌( గొల్లల మామిడాడ డీఆర్‌కే కలాశాల), ఎస్‌.కుమార్‌ (చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల) కె. సాయికుమార్‌ (గోపన్నపాలెం ఎస్‌ఎస్‌ఆర్‌ జీపీఈ కళాశాల), జి.మహేష్‌ (రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాల), వై.సతీష్‌ (రాజమండ్రి ఎస్‌కేవీటీ కళాశాల), టి.లక్ష్మీ నారాయణ(కపుల పాలెం ప్రకాష్‌ డిగ్రీ కళాశాల), ఎస్‌.గణేష్‌ (రామచంద్రపురం వీఎస్‌ఎం కళాశాల), కె.రాజేష్‌(జి.మామిడాడ, డీఆర్‌కే కళాశాల),జిఎల్‌.శ్రీనివాస్‌(కాకినాడ ఐడియల్‌ కళాశాల), డి.రాజ్‌కుమార్‌ (అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాల), డీవీ అనిల్‌కుమార్‌ (కాకినాడ ఐడియల్‌ కళాశాల), డి.సతీష్‌(భీమడోలు వెంకటేశ్వర కాలేజ్‌), వి.రామాంజనేయులు (పెనుమంట్ర ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల), కె.నాగవంశీ (పెనుగొండ ఎస్‌వీకేపీ కళాశాల) వీరు కాక జట్టులో స్టాండ్‌ బై ఆటగాళ్లుగా ఎ.దుర్గా ప్రసాద్‌( కాకినాడ ఐడియల్‌ కళాశాల), ఎం.సురేష్‌బాబు (మల్కిపురం అమృతా ఆర్ట్స్‌ కళాశాల), జె.కుమార్‌బాబు (చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సీహెచ్‌ ఎస్‌వీఎస్‌ దుర్గాప్రసాద్‌ (గొల్లమామిడాడ, డీఆర్‌కే కళాశాల). 
విజేత డీఆర్‌కే రెడ్డి కళాశాల జట్టు 
కాగా ఫైనల్‌ మ్యాచ్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జి.మామిడాడ డీఆర్‌కే రెడ్డి కళాశాల జట్టు కాకినాడ ఐడియల్‌ కళాశాల జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.వెలగా జోషి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ పీడీ సత్యనారాయణ, ఎంపిక కమిటీ సభ్యులు పీడీ జయకుమార్, పీడీ సురేష్‌ పాల్గొన్నారు. 
 
’ 
 
 
 
మరిన్ని వార్తలు