కౌశల్‌ వికాస్‌కు దరఖాస్తు చేసుకోండి

15 Feb, 2018 12:35 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు జయరామయ్య

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులు ప్రధాన మంత్రి  కౌశల్‌ వికాస్‌ యోజన  పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు జయరామయ్య తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేనేత కార్మికులకు మరమగ్గాల్లో వారి వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఆర్‌పీఎల్‌లో అధునాతనమైన డిజైన్స్‌ నేర్పించడంతోపాటు డిజిటల్‌ లెర్నిం గ్, మొబైల బ్యాంకింగ్, ఈ–కామర్స్‌ వంటి తదితర రంగాలలో శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో ఆసక్తిగల చేనేత మరమగ్గాలకు చెందిన కార్మికులందరూ తమ పేరు, తండ్రి పేరు, చిరునామా, ఆధార్‌కార్డుతోపాటు వృత్తి, బ్యాంకు వివరాలతో తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో రోజుకు రూ. 500 దినసరి ఇస్తామన్నారు. జిల్లాలో చేనేత కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు.

ఆదరణ–2కు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లాలో బీసీ వర్గాలకు ఆదరణ–2కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు జయరామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కార్మికులకు ఆదాయ వృద్ధి, ఆర్థిక తోడ్పాటు అందించేందుకు రూ. 2.5 లక్షల వరకు ఆధునిక ఉపకరణాలు (గుంతమగ్గాలు, పైమగ్గాలు, జాకాడ్‌ మగ్గాలు)ను అందించనున్నామన్నారు. మూడు సంవత్సరాల కాలంలో మగ్గాలలో లబ్ధిపొందని చేనేత కార్మికుల వివరాలను తమకు తెలుపాలన్నారు. జిల్లాలోని చేనేత వృత్తిపై జీవిస్తున్న వారు తమ పూర్తి చిరునామా, వృత్తి, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్, ఐఎస్‌ఎ‹ఫ్‌ కార్డు, ఏ మగ్గంపై పనిచేస్తున్నది తది తర వివరాలను సహాయ సంచాలకులు, చేనేత జౌళిశాఖ, డి–బ్లాక్, కొత్త కలెక్టరేట్‌లోని తమ కార్యాలయానికి పంపాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు