హరితహారంలో మొక్కలు నాటిన ఎస్పీ

16 Jul, 2016 23:22 IST|Sakshi
హరితహారంలో మొక్కలు నాటిన ఎస్పీ

మొక్కలు నాటుతున్న ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
ఆదిలాబాద్ క్రైం : హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రకృతి సహజసిద్ధంగా ఉండటానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత మొక్కలు నాటడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తల్లిందడ్రులకు తెలియజేయాలన్నారు. ప్రతిఇంటిలో 5 మొక్కలు నాటాలని, జనమైత్రి అధికారులు ఇందుకోసం మొక్కలు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.

ఇంట్లో పూలచెట్లు, మునగచెట్లు, కూరగాయల మొక్కలు నాటడం వల్ల ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. చెట్లతో మానవ మనుగడ ఆధారపడి ఉందని, వర్షాలు కురవకపోవడానికి కారణం అడువులు అంతరించిపోవడమేన్నారు. పర్యావరణ మార్పులు గమనించి మొక్కలు నాటేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, పాఠశాల హెచ్‌ఎం వెంకటస్వామి, వైస్ ప్రిన్సిపల్ నర్సయ్య, కాలనీ జనమైత్రి అధికారి అప్పారావులు ఉన్నారు.

మరిన్ని వార్తలు