డిసెంబర్లో ‘హెడ్‌మాస్టర్‌ అకౌంట్‌ టెస్ట్‌’

25 Oct, 2016 22:10 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఉపాధ్యాయులకు ‘హెడ్‌మాస్టర్‌ అకౌంట్‌ టెస్ట్‌’ పరీక్షలు డిసెంబరు 30, 31 తేదీల్లో ఉంటాయని డీఈఓ అంజయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కడపలో ఉంటాయన్నారు. పరీక్ష ఫీజు రూ.150 చెల్లించి నవంబరు 7లోగా దరఖాస్తు  చేసుకోవాలన్నారు. అలాగే రూ.60 అపరాధ రుసుంతో నవంబర్‌ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డీడీఓ కోడ్‌ 27000303001 మీద చలానా రూపంలో ఎస్‌బీఐ/ఎస్‌బీహెచ్‌ శాఖలలో మాత్రమే ఫీజు చెల్లించాలన్నారు.

మరిన్ని వార్తలు