విద్యార్థి చేయి విరగొట్టిన హెడ్మాస్టర్

30 Nov, 2016 03:03 IST|Sakshi
విద్యార్థి చేయి విరగొట్టిన హెడ్మాస్టర్

జ్యోతినగర్: ఓ విద్యార్థి తప్పు చేశాడని హెచ్‌ఎం కొట్టడంతో సదరు విద్యార్థి చేరుు విరిగిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో జరిగింది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రాచర్ల సారుుకృష్ణ అమ్మారుులను అల్లరి చేశాడని ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదుచేశారు. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయుడు కొమురయ్య విద్యార్థిని పిలిపించి మందలించాడు. ఈక్రమంలో కర్రతో కొట్టడంతో ప్రమాదవశాత్తు సారుుకృష్ణ చేరుువిరిగింది.

విద్యార్థి తల్లిదండ్రులు పేదవాళ్లు కావడంతో చికిత్స చేరుుంచుకోవడానికి డబ్బులు లేక.. ఓ చిన్న వైద్యుడి వద్ద కట్టుకట్టించుకున్నారు. కాగా ప్రధానోపాధ్యాయులు కొమురయ్య వివరణ కోరగా.. ‘సారుుకృష్ణ పాఠశాలలోని అమ్మారుులను అల్లరి చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దానిలో భాగంగా విద్యార్థిని పిలిచి మందలించాను. చిన్నగా కొట్టిన మాట వాస్తవమే. చికిత్స అవసరం అరుుతే చేరుుస్తాను. కొంతమంది కావాలని నాపై ఆరోపణలు చేరుుస్తున్నారు. వారిపై ఉన్నతాధికారులకు వివరిస్తాను’అని తెలిపారు.

మరిన్ని వార్తలు