అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

21 Oct, 2016 01:39 IST|Sakshi
అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
  • –ఏఎస్పీ శరత్‌బాబు
  • నెల్లూరు(క్రై మ్‌):
    పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు అన్నారు. స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం నెల్లూరు నగర పోలీసు అధికారులు, పీఎంపీ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో అగర్వాల్‌ కంటివైద్యశాల, విజయకేర్‌హాస్పిటల్, మాధవ్స్‌ డయాబిటెక్‌ కేర్‌ సెంటర్‌ల సహకారంతో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ    సమాజంలో అంతర్గత శాంతిభద్రలను కాపాడడంలో ఒక్కోసారి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచుతూ అశువులు బాస్తున్నారన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయసాధనకు అందరం నడుంబిగిద్దామన్నారు. అనంతరం పోలీసు సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు ప్రముఖ వైద్యులు డాక్టర్‌ శివప్రతాప్‌రెడ్డి, పి.మాధవ్, పి.విజయకుమార్, జి ఎల్‌ అన్నపూర్ణలు మధుమేహం, కంటి, గుండె సంబంధిత వ్యాధులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీచేశారు. అడిషినల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ రమాదేవి, పీఎంపీ జిల్లా అధ్యక్షుఢు శాఖవరపు వేణుగోపాల్, నెల్లూరు నగర, ఏఆర్‌ డీఎస్పీలు జి. వెంకటరాముడు,  చెంచురెడ్డి, రెండు, మూడు, నాలుగు, ఐదోనగర ఇన్‌స్పెక్టర్‌లు  కె.రామకృష్ణారెడ్డి, జి. రామారావు, సీహెచ్‌ సీతారామయ్య, మంగారావు, ఏపీ పోలీసు అధికారుల సంఘం జిల్లా అద్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు పాల్గొన్నారు
     
     
మరిన్ని వార్తలు