విధి నిర్వహణలో డ్రైవర్‌కు గుండెపోటు

27 Apr, 2017 01:13 IST|Sakshi
అనంతపురం న్యూసిటీ : విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుకు గురయ్యారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్లు నాగేంద్ర, ఖాన్‌ విజయవాడ డ్యూటీకి బుధవారం బయలుదేరారు. బస్సు బత్తలపల్లి సమీపానికి రాగానే టికెట్లు కొడుతున్న నాగేంద్రకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను తోటి డ్రైవర్‌ ఖాన్‌ హుటాహుటిన అనంతపురం బస్టాండ్‌కు తీసుకువచ్చారు. విషయాన్ని డ్యూటీలో ఉన్న రాయదుర్గం డిపో మేనేజర్‌ మద్దిలేటి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన, అనంతపురం డీఎం బాలచంద్రప్ప కలసి వెంటనే నాగేంద్రను 108లో సర్వజనాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచాలంటూ సూచించారు.
మరిన్ని వార్తలు