ముగిసిన దేవదేవుని దివ్య దర్శనం

23 Aug, 2016 23:41 IST|Sakshi
ముగిసిన దేవదేవుని దివ్య దర్శనం
విజయవాడ కల్చరల్‌:
 స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన నమూనా దేవాలయంలో 17 రోజులుగా పూజలందుకున్న దేవ దేవదేవుని దివ్యదర్శనం మంగళవారం పవళలింపు సేవ అనంతరం ముగిసింది. రికార్డు స్థాయిలో భక్తులు వేంకటేశ్వరున్ని దర్శించుకున్నారు. కృష్ణ పుష్కరాలు ముగియడంతో స్వామిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తారు. దేవాలయ ఉద్యోగులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు దర్శనం అనంతరం లడ్డూప్రసాదాలు అందించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో దేవాలయ నిర్మాణం పూర్తిచేశామని తెలిపారు. స్వరాజ్యమైదానంలో భక్తులకు ఏ మాత్రం అసౌకర్యాలు కలుగకుండా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. పుష్కర సమయంలో దాదాపు 5 లక్షల మంది దేవదేవున్ని దర్శించుకున్నారని వివరించారు. పుష్కరకాలంలో 12 లక్షల మందికి అన్నప్రసాదం అందిచామని తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగుల భాగస్వామ్యం వల్లనే సాధ్యమైందని అన్నారు. పద్మావతి ఘాట్‌లో నిర్వహించిన చక్రస్థానంలో కార్యక్రమాలు ముగిసాయని  ప్రభుత్వానికి చెందిన అన్నీ శాఖలు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పూజలు నిర్వహించామని తెలిపారు. దేవదేవునకు శోడషోపచారతో అర్చకులు పూజలు నిర్వహించారు. వేదపఠం, ఘన స్వస్తి, దాస సాహిత్యసేవా సాహిత్య  పరిషత్, ధర్మప్రచార మండలి సంయుక్తంగా భక్తి గీతాలను ఆలపించారు.
 
>
మరిన్ని వార్తలు