ఉద్ధృతంగా కుందూ

31 Aug, 2016 21:24 IST|Sakshi
ఉద్ధృతంగా కుందూ
 – నది తీరంలో వెయ్యి ఎకరాల్లో నీట మునిగిన వరి
 
కోవెలకుంట్ల: డివిజన్‌లోని పై ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకల్లోని నీరంతా కుందూ నదిలోకి చేరుతోంది. బుధవారం కూడా నది ఉద్ధృతంగా ప్రవహించింది. కోవెలకుంట్ల, వల్లంపాడు, కలుగొట్ల, గుళ్లదూర్తి, కంపమల్ల, క్రిష్టిపాడు, అల్లూరు, హరివరం, నర్శిపల్లె, మాయలూరు, పెద్దయమ్మనూరు, బోడెమ్మనూరు, ఒంటెద్దుపల్లె,  ప్రాంతాల్లోని వంతెనలపై కుందూ నీరు ప్రవహిస్తోంది. ఆయా గ్రామాల పరిధిలోని నదీతీరంలో సుమారు వెయ్యి హెక్టార్లలో వరి పైరు నీట మునిగింది. ఎకరాకు రూ.5వేలు వెచ్చించి వరినాట్లు వేయగా భారీ వర్షాల కారణంగా వరద నీటిలో కలిసిపోయి భారీ నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. రెండు రోజులుగా వరిమడులలో నీరు నిల్వడంతో పైరుపై ఆశలు వదులుకున్నారు.
 
మరిన్ని వార్తలు